కుటుంబాలు విచ్చిన్నం కావడాన్ని గల కారణాలు :
సమస్యలు: వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుల, మత, వర్ణ సమస్యలు.
వ్యక్తిగత సమస్యల విషయానికి వస్తే ముందు మనం అసలు వ్యక్తికీ కుటుంబానికి గల సంబంధం ఏమిటి?
ప్రతి మనిషి తన జన్మతః కొన్ని సంబంధాలు
ముడిపడిన
అనేకమైన వ్యక్తులు కలిగిన సమూహం లోనికి (
ప్రవేశిస్తాడు. ఇక్కడి నుండే తనకు ఊహ తెలియక పోయిన అనేకమైన బంధాలతో ముడిపడిపోతాడు. అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య, చెల్లెమ్మ, తమ్ముడు ఇలా అనేక రక్త సంభందాలతో తన జన్మతః ఒక కుటుంబంలోని ఇంత మందికి తను ఒక బంధువుగా, ఇంత మందిని తన బంధువులుగా కలిగి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. తాను పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా అన్ని విషయాలను తెలుసుకుంటూ, మొక్కల ప్రారంభమైన తన జీవితం పెద్ద వృక్షంగా మారి తాను ఒక కుటుంబం నుండి ఎదిగి తన వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం వివాహం చేసుకుని, తద్వారా సంతానని వృద్ధి చేసుకుంటాడు.
ఇలా ఒక వ్యక్తి జీవితం " సముద్రంలో చేప జీవితం, అడవిలో జంతువు జీవితం, చెట్టుపై పక్షి జీవితం ఎంత హాయిగా సాగిపోతుందో అలా కుటుంబంలో మనిషి జీవితం కూడా అలానే హాయిగా సాగిపోతుంది. కానీ ఇలా జరిగేది కేవలం కుటుంబం అంత ఒకే మాటపై ఉన్నప్పుడు మాత్రమే. కానీ అలంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. దేనికి చాలాకారణాలు ఉన్నాయి.
పైన ఒకవిషయము వివరించడం జరిగింది. కుటుంబం అంటే వ్యక్తుల సమూహం అని. వ్య్తక్తి కుటుంబంలో భాగం అయిన్నప్పటికీ ప్రతి వ్యక్తి ఒకే రకమైన ఇష్టాలను, అలవాట్లను, ఆలోచన ధోరణి కలిగి ఉండాలని లేదు. వ్యక్తి గతమైన సమస్యలలో ప్రధానమైన సమస్య ఇక్కడే మొదలవుతుంది. కుటుంబంలో వ్యక్తులు అందరు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండక పోవడం కుటుంబ విచ్చిన్నమైపోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది.
ఆర్థిక సమస్యల విషయానికి వస్తే ఒకప్పటితో కంటే కుటుంబాలు బాగా దృడంగా ఉండే రోజులలోని సమాజానికి, ప్రస్తుత సమాజానికి పోలికను గమనిస్తే ఆనాడు తక్కువ సంపాదనే
అయినా
నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉండటం వాళ్ళ కుటుంబమును పోషించడం పెద్ద సమస్యగా ఉండేది కాదు, కానీ ఈ రోజున ప్రతి వస్తువు ( ఆహార , గృహాఉపయోగ మొదలగునవి) ధర అధికంగా పెరిగింది. ఇలాంటి సమస్యల వల్ల కలిసి ఉంటె కుటుంబమని నెట్టుకు రావడం కష్టం కనుక పెద్దగా ఉన్న కుటుంబం చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోవడం జరుగుతుంది.
ఇకపోతే కుల, మత, వర్ణ సమస్యలు: మనిషి పుట్టుకతో తొడుక్కుని కులం, మతం, వర్ణం ఇవి కూడా కుటుంబ విచ్చిన్నంలో పాత్రను పోషిస్తున్నాయి. ఒక వ్యక్తి ( స్త్రీ లేదా పురుషుడు ) వివాహ చేసుకునే వారి విషయంలో తన అభిరుచికి సరిపడే వారిని ఎంపిక చేసుకున్నప్పుడు, ఆ ఎంపిక చేసుకున్న వ్యక్తి తమ కులం , మతం, వర్ణం కాకపోయినప్పుడు, కుటుంబంలో భిన్న అభిప్రాయాల మధ్య కుటుంబం నుండి ఆ వ్యక్తి వియోగం చెందుతాడు.