వసుదైక కుటుంబం అనే పేరు గల మనభారత దేశమే కాదు అలంటి భావన వున్నా ఎన్నో దేశాల్లో కుటుంబాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సమకూర్చడంలో ప్రధాన పాత్ర వహించిన గాంధీ గారు కూడా ఎప్పుడు తన జీవిత లక్ష్యం ఒకటే అని చెప్పేవారు,
"అంటరాని తన్నానని, అంతర్ కలహాలను రూపు మాపడానికే నా జీవితం మొత్తం అంకితం."
అలంటి మహాత్ముడే కాదు ఆనందం కావాలని అనుకునే ప్రతి మనిషి కోరుకునేది ఒకటే కలసి ఉంటే కలదు సుఖం. కానీ అనేక రకమైన సమస్యలు, సందర్భాలు మనిషి ఐక్యమత్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. అలంటి సమస్యలు మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మన జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనపుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను, కొంతమంది జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను వారి అనుభవాలను తెలియజేయడం ద్వారా సమసమాజ స్థాపన లో మా వంతు పాత్రను పోషించాలని అనుకుంటూ, మా ఆలోచన ద్వారా మీ అందరికి తెలియజేయాలని ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాము. మీ యొక్క సలహాలను, సూచనలను, మా బ్లాగ్ లో ఏదైనా తప్పుగా ప్రచారం చేస్తే సవరిస్తారని వీక్షకులందరిని కోరుకుంటున్నాము.
చినుకు చినుకు కలసి కలసి వర్షమై భూమి పులకించినట్లు మనిషి మనిషి కలసి ప్రతి దేశం శాంతిని, ఆనందాన్ని పంచాలి.
No comments:
Post a Comment